‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌పై సైబర్‌ పోలీసుల కేసు

AI Videos Targeting Narendra Modi : ఏఐ (కృత్రిమ మేధస్సు) సాంకేతికతతో రూపొందించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల కమిషన్‌పై ఏఐ ఆధారిత అపవాద వీడియోలు ‘ఎక్స్‌’ (X) ప్లాట్‌ఫామ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సైబర్‌ పోలీసులు ‘ఎక్స్‌’ సంస్థపై కేసు నమోదు చేశారు.

ఆ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, దేశ ప్రధాని మరియు ఎన్నికల కమిషన్‌ పరువును బలంగా దెబ్బతీసేలా రూపొందించబడ్డాయని పోలీసులు వెల్లడించారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఇవి ప్రతికూలంగా ప్రభావం చూపుతాయని, అందువల్ల చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

తిరువనంతపురం సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ‘ఎక్స్‌’ సంస్థతో పాటు ఆ ఏఐ వీడియోలు పోస్ట్‌ చేసిన ఒక యూజర్‌ ఖాతాపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టినట్లు సైబర్‌ పోలీసులు ప్రకటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story