Air India Flight : రన్ వేపై ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం
ల్యాండ్ అవుతూ రన్ వేపై అదుపుతప్పిన ఎయిర్ ఇండియా విమానం

గడచిన 24 గంటల వ్యవధిలో భారత్ లో రెండో విమానం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం జూలై 21వ తేదీ కొచ్చి నుంచి ముంబయ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ముంబయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వేపై అదుపుతప్పింది. కొన్ని గంటలకుగా ముంబయ్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ఎయిర్ ఇండియా విమానం ల్యాడ్ అయినప్పుడు అదుపుతప్పి రన్ వే నుంచి పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్ట్ ఎమర్జెన్సీ బృందాలు ప్రయాణికులను సురక్షితంగా కిందకి దింపారు. కాగా రన్ వేపై విమానం అదుపుత్పిన సమయంలో ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి మూడు ల్యాండిగ్ వీల్స్ దెబ్బతిన్నాయి. రన్ వే కూడా కొంత మేర పాక్షికంగా దెబ్బతింది. దీంతో ముంబయ్ ఎయిర్ పోర్టులోని ప్రైమరీ రన్ వేలో ల్యాండ్ అవ్వాల్సిన ఇతర విమానాలను సెంకడరీ రన్ వేపైకి మళ్లించారు. అయితే ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పినప్పుడు విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో వెల్లడి కాలేదు. దెబ్బతిన్న రన్ వే మరమ్మతు పనులు ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెంటనే చేపట్టారు.
