దెబ్బతిన్న ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్

ఈనెల 12వ తేదీన ఆహ్మదాబాద్ లో సంభవించిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ దెబ్బతినడం వల్ల విమాన ప్రమాదానికి కారణమైన అంశాలను గుర్తించడంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 279 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం బ్లాక్ బాక్స్ కి సంబంధించి ఓ జాతీయ మీడియా ప్రత్యేక కథనం ప్రచురించింది. జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం సాంకేతిక కారణాలతో నేలపై కూలి పేలిపోయి కాలి బూడిదైపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 28 గంటల తరువాత దర్యాప్తు బృందాలు విమాన శకలాల నుంచి బ్లాక్ బాక్స్ ను వెలికితీశాయి. అయితే ప్రమాం జరిగన ధాటికి బ్లాక్ బాక్స్ పై భాగంలో ఓ పక్క బాగా దెబ్బతిన్నట్లు ద్యార్యాప్తు అధికారులు గుర్తించారు. బ్లాక్ బాక్స్ దెబ్బతినండంతో దాన్ని డీకోడ్ చెయ్యడానికి అమెరికా పంపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర విమానయాన శాఖ ఖండించింది. బ్లాక్ బాక్స్ కి సంబంధించి సాంకేతిక, భద్రతా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దానిపై తుది నిర్ణయం ఉంటుందని చెపుతున్నారు. అయితే అవసం మేరకు బ్లాక్ బాక్స్ ఎక్కడికైనా పంపిచాల్సిన అవసరం ఏర్పడితే ఆ విషయంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి డిజిటల్ ఫ్లట్ రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌లను కలపి బ్లాక్ బాక్స్ అంటారు. వ్యవహారంలో బ్లాక్ బాక్స్ అని అంటారు కానీ వాస్తవానికి అది ముదురు కషాయ రంగులో ఉంటుంది. సాధారణంగా విమాన క్రాష్ అయ్యిందంటే మంటలు వ్యాపించి విమాన శకలాలు నల్లగా మారిపోతాయి. ఆ నల్లటి శకలాల నుంచి సులువుగా గుర్తించడానికి బ్లాక్ బాక్స్ కు ముదురు ఆరెంజ్ కలర్ వేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ లు 25 గంటల పాటు కాక్ పిట్ సంభాషణలను రికార్డ్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అయితే ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 పన్నెండేళ్ళ క్రితంది కావడంతో ఈ విమానంలోని బ్లాక్ బాక్స్ కేవలం రెండున్నర గంటల రికార్డింగ్ సామర్ధ్యాన్నే కలిగి ఉంది. అయితే డీకోడింగ్ కు ఏ మాత్రం అనువుగా ఉన్నా లక్నోలో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కి పంపి డీకోడ్ చేసుకోవడం. అది వీలు కాని పక్షంలో అమెరికాలోని నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ పంపాలి. లేదా సింగపూర్, యూకేల్లో ఉన్న సివిల్ ఏవిషన్ అథారిటీలకు పంపి బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసుకోవడం తప్పనిసరి అవుతుందని అధికారులు చెపుతున్నారు.
