న్యూఢిల్లీలో అమరావతి ప్రాపర్టీ షో 2025 బ్రోచర్ ఆవిష్కరించిన రామ్మోహన్ నాయుడు

ప్రతిష్టాత్మకంగా న్యూఢిల్లీలో ప్రారంభమైన 17వ నారెడ్కో జాతీయ సదస్సు లో శనివారం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 బ్రోచర్ ‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. అమరావతిని భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ముఖ్య కేంద్రంగా ప్రదర్శించడానికి ఈ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, అమరావతి భారత అభివృద్ధి చరిత్రలో కీలక పాత్ర పోషించబోతోందని, ఈ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులను ప్రపంచ స్థాయి భాగస్వాములతో కలిపే వేదికగా మారుతుందని పేర్కొన్నారు. ఆధునిక పట్టణ రూపకల్పన, స్మార్ట్ మౌలిక వసతులు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో అమరావతి ఆదర్శ రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025లో నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వ దూరదృష్టి, పెట్టుబడి సౌహార్ధ విధానాలు, సమగ్ర టౌన్‌షిప్ ప్రణాళికలు ప్రదర్శించబడతాయని తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు, అభివృద్ధిదారులు, ఎన్‌ఆర్‌ఐలు, విధాన నిర్ణేతలు హాజరవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ జి. సూర్య ప్రవీణ్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నారెడ్కో జాతీయ అధ్యక్షుడు జి. హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. చక్రధర్, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పారుచూరి తదితరులు హాజరయ్యారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story