Delhi Cm Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాపై దాడి
దాడి చేసిన దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. జన్ సున్‌నాయ్ కార్యక్రమంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఢిల్లీ సీయం రేఖాగుప్తా జన్ సున్‌నాయ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తుండగా ఒక వ్యక్తి ఆమెపై దాడి చేశారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తాను ఒక వ్యక్తి పరుష పదాలతో దూషిస్తూ ఒక్కసారిగా అమె చెంపపై కొట్టాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఊహించని విధంగా సీయంపై జరిగిన ఈ దాడి దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్ ఉన్న సీయం అధికారిక నివాసంలో రేఖాగుప్తా జన్ సున్‌వాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సీయం రేఖాగుప్తాకు అర్జీలు సమర్పిస్తున్నట్లుగా ఆమె చేతికి కొన్ని కాగితాలను అందించి అనంతరం దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెపుతున్నారు. ఆ వ్యక్తికి సమారు 35 సంవత్సరాల వయసు ఉంటుందని చెపుతున్నారు. సీయంపై దాడికి పాల్పడిన వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ తీవ్రంగా ఖండించారు. సంఘనపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.
