Ayodhya Ram Temple: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో విరాళాల చోరీ ఘటనల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల లెక్కింపు వ్యవస్థలో ముఖ్యమైన మార్పులు చేసింది. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం కోసం కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.

విరాళాలు లెక్కించే సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు. అంతేకాకుండా, జేబులు లేని (పాకెట్‌లెస్) ప్రత్యేక యూనిఫాం ధరించాల్సి ఉంటుంది. ఈ యూనిఫాం ముదురు నీలం రంగులో ఉంటుంది. హుండీ లెక్కింపు హాలులోకి ప్రవేశించే ముందు సిబ్బందికి రెండంచెల భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు.

ఇకపై విరాళాల లెక్కింపు విధానంలో కూడా సమూల మార్పులు చేశారు. సిబ్బంది బల్లలు, కుర్చీల వద్ద కాకుండా నేలపై కూర్చొని విరాళాలను లెక్కించాలి. ఇలా చేయడం ద్వారా నగదు లేదా విలువైన వస్తువులను దాచుకునే అవకాశం లేకుండా చేయాలని ట్రస్ట్ భావిస్తోంది.

ఈ కేసు దర్యాప్తు భాగంగా ట్రస్ట్ ఖాతాలపై సిట్ ఆడిట్ నిర్వహించనుంది. గత ఐదేళ్లలో ఆలయ నిర్మాణ ఖర్చులు, వచ్చిన విరాళాలు, నిధుల వినియోగం వంటి అన్ని అంశాలను సమీక్షించనున్నారు. దొంగలించిన నగలను గుర్తు పట్టకుండా నిందితులు వాటిని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ కొత్త నిబంధనలు ఆలయ విరాళాల పారదర్శకతను మరింత పెంచి, భక్తుల విశ్వాసాన్ని కాపాడటంలో సహాయపడతాయని ట్రస్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story