88 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన.. హిమంత జాలుక్‌బారీ నుంచి బరిలో

First List in Assam: అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (భాజపా) తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కంచుకోటగా భావించే జాలుక్‌బారీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

హిమంత బిశ్వ శర్మ 2001, 2006, 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జాలుక్‌బారీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి చేరిన కీలక నేతల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన భూపేన్ కుమార్ బోరా బిహ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు బుధవారం కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన ప్రద్యుత్ బోర్డోలోయ్ దిస్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. భాజపా 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన సీట్లను తన మిత్రపక్షాలైన అసోం గణ పరిషద్ (AGP)కు 26, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF)కు 11 సీట్లు కేటాయించింది.

ఈ జాబితాతో అస్సాం ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story