Central Government: ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2024లో ఉన్న ‘ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం’ను సవరించి మరింత కఠినంగా మార్చే ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త శిక్షలు ఇవి...

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం వ్యక్తిగత లీక్‌ కేసుల్లో 3-5 ఏళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా; సంస్థాగత నేరాలకు 5-10 ఏళ్ల జైలు, రూ.1 కోటి జరిమానా ఉంది. కొత్త సవరణలతో లీక్‌లకు పాల్పడేవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నారు. లీక్‌ సంబంధిత కేసులను మూడు నెలల్లో పూర్తి చేసి దోషులకు శిక్ష విధించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. దిల్లీలో ఇప్పటికే ఒక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు మొదలైంది. మరిన్ని ఏర్పాటు చేయనున్నారు.

ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో లీక్‌ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే వారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

నేపథ్యం

ఇటీవల నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, వివిధ సంస్థలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నేతృత్వంలోని నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం త్వరిత చర్యలు చేపట్టింది. క్యాబినెట్‌ భేటీలో లీకుల నివారణ, విద్యా సంస్కరణలపైనా చర్చించారు.

ఈ చట్ట సవరణతో పరీక్షల సమగ్రతను కాపాడి, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం లక్ష్యమని కేంద్రం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా పేపర్‌ లీక్‌ మాఫియాపై బలమైన చర్యలు సాధ్యమవుతాయని భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story