Supreme Court: నిరసనల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యువతను బలప్రయోగంతో ఎదుర్కోవడం కాకుండా, వారిని శాంతింపజేయడమే ప్రధాన కర్తవ్యమని కోర్టు సూచించింది.

సీజేపీ పిలుపునిచ్చిన ‘చలో పార్లమెంటు’ (సంసద్ చలో) మార్చ్‌లో హింసను ప్రేరేపించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

కొంతమంది తప్పుదారి పట్టినవారు రాళ్లు రువ్వినా, ముందుగా యువతను శాంతపరచడమే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. వారిని బలప్రయోగంతో ఎదుర్కొనే బదులు, మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడమే ఉత్తమ మార్గమని స్పష్టం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా దుకుడు ప్రదర్శిస్తే హింస మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.

ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తినప్పుడు పోలీసులు సహనంతో వ్యవహరించి పరిస్థితులు అదుపు తప్పకుండా చూడాలని కోర్టు సూచించింది. యువత ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, వారి సమస్యలేంటో ముందుగా వినాలని, వాటిని అర్థం చేసుకోవడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొంది. ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు పూర్తి అవగాహన ఉందని, అది వారి నిర్ణయానికే వదిలివేయడం సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది.ఈ వ్యాఖ్యలు నిరసనల్లో పోలీసు చర్యలపై ముఖ్యమైన మార్గదర్శకాలుగా నిలిచాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story