WhatsApp: భారత్‌లో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ప్రారంభాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ ఫీచర్ దుర్వినియోగం, మోసాలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సంప్రదింపులు జరపాలని కేంద్రం నిర్ణయించింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను భారత్‌లో లాంచ్ చేయవద్దని వాట్సాప్ మాతృ సంస్థ మెటాను కేంద్రం సూచించినట్టు జాతీయ మీడియా నివేదికలు వెలువడ్డాయి. ఈ అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఫీచర్ పనితీరు, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, భద్రతా చర్యలు వంటి పూర్తి వివరాలు ఇవ్వాలని మెటాకు మూడు రోజుల గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఈ ఫీచర్ ద్వారా యూజర్ల గోప్యతను మరింత బలోపేతం చేస్తుందని పేక్కొంది. ఫోన్ నంబర్ పంచుకోకుండా యూజర్ ఐడీ ద్వారా కొత్తవారితో చాట్ చేయవచ్చని ప్రకటించింది. అయితే భారత్ వంటి దేశాల్లో ఇది మోసాలు, సైబర్ నేరాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసాల సందర్భంలో నిందితులను గుర్తించడం కష్టమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం ఈ ఫీచర్‌పై సమగ్ర సమీక్ష చేసి, యూజర్ల భద్రత, గోప్యతను కాపాడేలా తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story