Centre Tells Supreme Court: విదేశీయులను వారి స్వదేశాలకు బహిష్కరించే ముందు తప్పనిసరిగా వారి జాతీయతను ధృవీకరించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. సంబంధిత దేశాలు జాతీయతను అంగీకరించకపోతే వారిని డిపోర్ట్ చేయడం సాధ్యం కాదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన వ్యక్తులను బహిష్కరించకుండా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా కేంద్రం ఈ వివరాలు సమర్పించింది. ఒక విదేశీయుడికి శిక్ష లేదా కోర్టు విచారణలు పూర్తయిన తర్వాత, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రం లేదా పాస్‌పోర్ట్ ఉండి, వారిపై మరే ఇతర క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేకపోతేనే బహిష్కరణ సాధ్యమని కేంద్రం పేర్కొంది.

డిపోర్టేషన్‌కు ముందు సంబంధిత దేశ రాయబార కార్యాలయం నుంచి జాతీయత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కూడా స్పష్టం చేసింది. జాతీయత నిర్ధారణ లేకుండా ఎవరినీ వెనక్కి పంపలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Next Story