Congress President Sonia Gandhi Unwell

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి ఆస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాల రిత్యా ఆస్పత్రిలో చేర్చించారు. నిన్న(ఆదివారం) రాత్రి హఠత్తుగా ఉదర సంబంధిత సమస్య అధికం కావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధినేత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని… వైద్యుల పర్యవేక్షణలో సోనియాగాంధీకి చికిత్స జరుగుతోంది.

ఇదే నెల 7వ తేదీన(శనివారం) అస్వస్థతకు గురికావడంతో షిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఎమ్మారై సహా పలు పరీక్షలు నిర్వహించాక ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అధిక రక్తపోటుతో ఆస్పత్రికి వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అప్పుడు వైద్యులు ప్రకటించారు. కుమార్తె ప్రియాంకగాంధీతో కలిసి సోనియా వ్యక్తిగత పర్యటనకు సిమ్లా వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆమె అస్వస్థతతో ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో చేరారు.


ఆరోగ్య పరిస్థితుల కారణంగా సోనియాగాంధీ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొంటున్నారు. చివరిసారిగా మే 27న దివంగత ప్రధాని జవహర్‌లా నెహ్రూ 61వ వర్దంతి సందర్భంగా కనిపించారు.

Politent News Web3

Politent News Web3

Next Story