ప్రస్తతం మహరాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌

చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ను ఎన్‌డీఏ తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సీపీరాధాకృష్ణన్‌గా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. సీపీరాధాకృష్ణన్‌ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు లోక్‌సభ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తమిళనాడు రాష్ట్రానికి భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాధాకృష్ణన్‌ 1998లో మొదటి సారి కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యరు. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో రెండో సారి అదే స్ధానం నుంచి గెలుపొందగా 2004, 2014, 2019ల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా 2016 నుంచి 19 వరకూ కాయిర్‌ బోర్డు చైర్మన్‌గా చేశారు. 2023 ఫిబ్రరి 12వ తేదీన జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసై సౌందర్‌రాజన్‌ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో అప్పటి నుంచి 2024 జలై 31 వరకూ తెలంగాణ గవర్నర్‌తో పాటు పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే సంవత్సరం జూలై 27న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్‌డీఏ అభ్యర్ధిగా సీపీరాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story