Along with its status as the capital of the country, Delhi has also become the capital of air pollution.

ఢిల్లీ దేశ రాజధాని హోదాతో పాటు వాయు కాలుష్యానికి క్యాపిటల్ గా మారింది. శీతాకాలం, వేసవి కాలం పెరుగుతున్న కాలుష్యంతో రాజధాని వాసులు నానా యాతన పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జులై 4 నుంచి 11 మధ్య కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలను ఐఐటీ కాన్పూర్‌ చూసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) నుంచి అనుమతి పొందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కృత్రిమ వర్షంకు దాదాపు రూ.3.21 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

కృత్రిమ వ‌ర్షం అంటే..?

కృత్రిమ వ‌ర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వెద‌ర్‌లో మార్పును తీసుకువ‌స్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియ‌ను కొన‌సాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్‌, పొటాషియం ఐయోడైడ్ లాంటి ప‌దార్ధాల‌ను గాలిలోకి వ‌దులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ స‌క్సెస్ కావాలంటే, ఆ ప‌రీక్ష స‌మ‌యంలో వాతావ‌ర‌ణంలో తేమ చాలా అవ‌స‌రం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం స‌క్సెస్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. కృత్రిమ వ‌ర్షం వ‌ల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డ‌స్ట్ కొట్టుకుపోయి.. ప‌ర్యావ‌ర‌ణం క్లీన్ అవుతుంది.

Politent News Web3

Politent News Web3

Next Story