DMK MLA Anitha Radhakrishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించడంతో శుక్రవారం ఈ చర్య తీసుకోవడం జరిగింది.

జూన్ 20న మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాధాకృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా నటుడిగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని వ్యంగ్యంగా విమర్శించడంతో పాటు, ఒక నటి ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేయగా, హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.

ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలు అనుసరిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story