Justice Surya Kant: నల్సార్ విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు.. బీసీఐకి సీజేఐ ఆదేశం
బీసీఐకి సీజేఐ ఆదేశం

Justice Surya Kant: హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ను ఆదేశించారు. ఇది తనకు, విద్యార్థులకు మధ్య జరిగిన సమస్య అని, బీసీఐ జోక్యం అనవసరమని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐను పిలవొద్దంటూ విద్యార్థులు లేఖ రాసిన వార్తలు వచ్చాయి. దీనిపై బీసీఐ ఛైర్మన్ మనన్‌కుమార్ మిశ్ర దేశవ్యాప్త బార్ కౌన్సిళ్లకు లేఖ రాసి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దని ఆదేశించారు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ “రాజ్యాంగబద్ధ సంస్థతో విభేదించినంత మాత్రాన విద్యార్థుల న్యాయవాద హక్కును నిరాకరించకూడదు” అని అన్నారు.
సీజేఐ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారు. “ఇదంతా అనవసరం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో పాల్గొనేవాడిని. ఇది నాకు, విద్యార్థులకు మధ్య విషయం. జోక్యం చేసుకోవడానికి వారెవరు?” అని ఆయన అన్నారు. నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని స్పష్టం చేశారు. బీసీఐ సర్క్యులర్‌పై వివరణ ఇవ్వాలని, నల్సార్ విద్యార్థులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
- NALSARNALSARStudentsNALSARUniversityChiefJusticeOfIndiaCJISupremeCourtBarCouncilOfIndiaBCILegalEducationLawStudentsLawEducationStudentRightsStudentReliefJudiciaryIndianJudiciaryLegalNewsCourtNewsSupremeCourtNewsEducationNewsLawCollegeLegalUpdatesIndiaNewsHyderabadNewsTelanganaNewsLatestLegalNewsLatestEducationNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

