ది స్థలాల్లో దాడులు... కుమార్తె వీణ కంపెనీకి CMRL నుంచి రూ.1.72 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణ

ED Conducts Raids: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఉదయం సోదాలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ బృందాలు దాడులు నిర్వహించాయి.

ఈ సోదాలు మనీలాండరింగ్ కేసుకు సంబంధించినవి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) నుంచి పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి రూ.1.72 కోట్లు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణ. ఈ మొత్తానికి ఎలాంటి సేవలు అందించకుండానే డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కేసు నేపథ్యం:

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ఇంతకుముందు ఈ కేసుపై విచారణ చేపట్టింది. 2018 నుంచి 2021 మధ్య కాలంలో ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేరళ హైకోర్టు స్టేను ఎత్తివేసిన తర్వాత ఈడీ దర్యాప్తు తీవ్రం చేసింది.

పినరయి విజయన్ తిరువనంతపురం, కన్నూర్ నివాసాలతో పాటు, ఆయన కుమార్తె వీణ, ఆమె భర్త పి.ఎ. మహమ్మద్ రియాస్ (మాజీ మంత్రి) సంబంధిత స్థలాల్లో కూడా ఈడీ దాడులు జరిపింది.

ప్రస్తుతం ఎవరినీ అరెస్టు చేయలేదు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story