కొండచరియలు గ్రామంపై పడటంతో 60 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని గంగోత్రి ప్రాంతంలో పర్వతాల మధ్య ఉన్న ధారావలి గ్రామంపై ఉధృతమైన వరద పోటెత్తడంతో వరద నీటితో పాటు కొండ చరియలు కూడా విరిగిపడి గ్రామంలోని ఇళ్ళను ధ్వసం చేశాయి. ఈ దారుణ ఘటనలో 60 మంది గల్లంతైనట్లు ఇప్పటి వరకూ గుర్తించారు. ఈ అరవై మంది జాడ తెలియడం లేదు. అలాగే కొండ చరియల కారణంగా భారీగా ఇళ్ళు కూలిపోవడంతో శిధిలాల కింద కూడా చాలా మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. విషయం తెలియగానే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అకస్తాత్తుగా విరుచుకుపడిన ఈ వదరల కారణంగా కొండ చరియల కింద అనేక మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగానే ఈ విపత్తు సంభవించిందని ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ ఆర్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న ధరావలి గ్రామంలో పెద్ద ఎత్తున క్లౌడ్‌ బరస్ట్‌ జరిగిందని దీంతో నీటి ఉధృతికి కొండ చరియలు కూడా కొట్టుకు వచ్చి నివాస గృహాల మీద పడ్డాయని కలెక్టర్‌ తెలిపాయి. ఈ ఘోర విపత్తుపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి వెంటనే స్పందించి సహాయక బృందాలను వరద ముంపు గ్రామానికి పంపించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story