Prajwal Revanna : లైగింక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు జీవిత ఖైదు
శిక్షను ఖరారు చేసిన బెంగుళూరు ప్రజా ప్రతినిధుల న్యాయస్ధానం

పని మనిషిపై లైంగిక దాడి కేసులో కర్నాటక మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారమే ప్రజ్వల్ ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించింది. శనివారం న్యాయస్ధానం ఈ కేసులో శిక్షను ఖరారు చేసింది. లైగింక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ జీవిత ఖైదుతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీనితో పాటు బాధితురాలికి ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మాజీ ప్రధాని హెచ్‌డీదేవెగౌడ పెద్ద కుమారుడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణ 2019లో కర్నాటకలోని హసన్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందార. 2021 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో హసన్ పరిధిలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్న 48 సంవత్సరాల వయసు గల పనిమనిషిపై అత్యాచారానికి పల్పడ్డాడటమే కాకుండా వీడియో కూడా తీశాడని ప్రజ్వల్‌పై కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారించిన బెంగుళూరు ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న శుక్రవారం ప్రజ్వల్‌ని దోషిగా నిర్ధారించి ఈ రోజు శనివారం అతనికి శిక్షను ఖరారు చేసింది.
