శిధిలాల కింద నిర్వాసితులు… కొనసాగుతున్న సహాయక చర్యలు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనల భవంతిలో నివాసం ఉంటున్న నివాశితులు శిధిలాల కింద చిక్కుకు పోయారు. సహయాక బృందాలు నలుగురు క్షతగాత్రులను వెలికి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలో ఉన్న శీలంపూర్‌ ప్రాంతంలోని మజ్దూర్‌ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం శనివారం ఉదయం 7 గంటల సమయలో కుప్పకూలి పోయింది. భవంతిలో నివాసం ఉన్న వాళ్ళందరూ శిధిలాల కింద చిక్కుకు పోయారు. సమాచాం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్ధలానికి చేరుకుని సహయాక చర్యలు చేపట్టారు. పోలీసు కూడా సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమైనా సంభవించిందా అనే విషయం తెలియరాలేదు. కానీ శిధిలాల కింద కొందరు నివాశితులు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story