The Fascinating Journey of Shreyasi Singh: షూటర్ నుంచి మంత్రి వరకు... శ్రేయసి సింగ్ ఆసక్తికర నేపథ్యం!
శ్రేయసి సింగ్ ఆసక్తికర నేపథ్యం!

The Fascinating Journey of Shreyasi Singh: బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. జేడీయూ నేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువతి శ్రేయసి సింగ్ అందరి దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయ స్థాయి షూటర్‌గా పేరొందిన ఆమె... ఇప్పుడు, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్రేయసి సింగ్ 1991 ఆగస్టు 29న బిహార్‌లోని గిఢౌర్ గ్రామంలో జన్మించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్ కేంద్ర మాజీ మంత్రి. తల్లి పుతుల్ కుమారి ఎంపీగా పనిచేశారు. తాత, తండ్రి ఇద్దరూ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో అధ్యక్షులుగా పనిచేశారు. ఈ షూటింగ్ నేపథ్యమే శ్రేయసిని క్రీడారంగంలోకి తెచ్చింది.
క్రీడల్లో శ్రేయసి సాధించిన విజయాలు అద్భుతం. డబుల్ ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు ప్ర reatినిధ్యం వహించిన ఆమె... 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఈ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డు ప్రదానం చేసింది.
2020లో బీజేపీలో చేరిన శ్రేయసి... బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జముయీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆర్జేడీ అభ్యర్థి షంషాద్‌ను భారీ మెజారిటీతో ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
క్రీడావేత్త నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన శ్రేయసి సింగ్... బిహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

