కాంగ్రెస్ ప్రశ్న

Congress Party President Mallikarjuna Kharge: వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందా అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రకటన బయటకు రావడం అనుమానాలకు తావిస్తోందని ఆయన విమర్శించారు.

అమెరికా ఉత్పత్తులపై సున్నా సుంకాలకు (జీరో టారిఫ్) భారత్ అంగీకరించిందా? రైతుల హక్కులకు, వారి రక్షణకు ఏమైనా చర్యలు తీసుకుందా? అని ఖర్గే ఎక్స్ (ట్విట్టర్)లో ప్రశ్నల వరస వేశారు.

గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో అమెరికాతో కుదిరిన అణు ఒప్పందం సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించిందని ఖర్గే గుర్తుచేశారు. ఆ ఒప్పందంతో పాటు సంబంధిత అనేక ఒప్పందాల్లో పార్లమెంటు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.

కానీ ప్రస్తుత వాణిజ్య ఒప్పందం విషయంలో దేశ ప్రజలకు ఏమీ తెలియడం లేదని, అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో బయటి నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం తగదని ఖర్గే స్పష్టం చేశారు.

ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, పార్లమెంటులో చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story