12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింన ముంబై కోర్టు

ముంబయ్‌ బాంబు పేలుళ్ళ కేసులో మహరాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రైలు పేలుళ్ళ ఘటనలో శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ముంబై హైకోర్టు సోమవారం ప్రకటించింది. కన్ఫెషన్‌ స్టేట్మెంట్లు, గుర్తింపు పరేడ్‌, సాక్షుల వాంగ్మూలాల వంటి ఆధారాలు నమ్మదగినవిగా లేవని అభిప్రాయపడుతూ ముంబై హైకోర్టు శిక్ష పడిన 12 మందిని వెంటనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 2006 జైలై 11వ తేదీన ముంబయ్‌ వెస్ట్రన్‌ రైల్వే లైనులో నడుస్తున్న పలు సబర్బన్‌ రైళ్ళలో వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనల్లో దాదాపు 189 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. అలాగే సుమారు 800 మందికి పైగా అమయక ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంఘటనలో నిందితులను పట్టుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. పోలీసుల దర్యాప్తు తరువాత ప్రత్యేక న్యాయస్ధానం 12 మందికి 2015లో శిక్షలు ఖరారు చేసింది. నిందితులు 12 మందిలో ఐదుగురికి మరణ శిక్ష విధించగా మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్‌ కోర్టు 2015లో తీర్పు ఇచ్చింది. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మహరాష్ట్ర ప్రభుత్వం కూడా పిటీషన్ దాఖలు చేసింది. 2024 జైలై మాసంలో రోజు వారీ విచారణ ప్రారంభమైన ఈ కేసులో సోమవారం, జూలై 21, 2025న ముంబై హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. స్పెషల్‌ కోర్టు దోషులుగా నిర్ధారించిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని ముంబై హైకోర్టు అభిప్రాయపడింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story