Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం సీఈవో పదవికి భారీ ఆసక్తి: వేయికి పైగా దరఖాస్తులు
వేయికి పైగా దరఖాస్తులు

Ayodhya Ram Temple: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి భారీ స్పందన వెల్లువెత్తింది. నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల్లోనే 1,000కి పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
రాజకీయ నేపథ్యం ఉన్నవారు, మాజీ ఉన్నతాధికారులు, వివిధ రంగాల నిపుణులు ఈ పదవి కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. దరఖాస్తుల స్వీకరణ జులై 18 వరకు కొనసాగుతుందని, పరిశీలన ప్రక్రియ జులై 19 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జులై 22న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో సీఈవో నియామకంపై తుది నిర్ణయం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ట్రస్ట్ అధికారుల ప్రకారం, కొత్త సీఈవోను కాంట్రాక్టు పద్ధతిలో మూడేళ్ల పదవీకాలానికి నియమించనున్నారు. పనితీరు ఆధారంగా తర్వాత పొడిగింపు ఇవ్వవచ్చు. ట్రస్ట్ నిర్ణయాల అమలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం వంటి కీలక బాధ్యతలు సీఈవోకు ఉంటాయి.
ఈ నియామకం అయోధ్య రామాలయం అభివృద్ధి మరియు నిర్వహణలో ముఖ్యమైన మైలురాయిగా మారనుంది.

