Nitin Gadkari’s Shocking Remarks: మామగారి ఇంటిని కూల్చేశా.. పరిహారమే ఇచ్చా: నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
పరిహారమే ఇచ్చా: నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Nitin Gadkari’s Shocking Remarks: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పని పట్ల తనకు ఎవరూ భేదం లేదని, అందరినీ సమానంగానే చూస్తానని తేల్చి చెప్పారు. రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుపడితే సొంత మామగారి ఇంటినైనా కూల్చేస్తానని, అలాంటి ఘటన గతంలో జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో గడ్కరీ దంపతులు పాల్గొన్న సందర్భంగా ఈ విషయం బయటపడింది.
ఫరా ఖాన్ తన కుక్ దిలీప్‌తో కలిసి దిల్లీలోని గడ్కరీ నివాసాన్ని సందర్శించారు. ఈ క్రమంలో దిలీప్ తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం మంత్రిని కోరాడు. దీనికి ఫరా హాస్యంగా "అతని ఇంటి మీదుగా రోడ్డు వేసేయండి" అని సూచించారు. అప్పుడు మంత్రి భార్య కాంచన్ గడ్కరీ మాట్లాడుతూ, "అలా చేస్తే అతని ఇల్లు పోతుంది కదా.. నా తండ్రిది లాగా" అని అన్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వివరణ ఇస్తూ.. "రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని నా మామగారి ఇంటినే కూల్చేశా. కొత్త ఇల్లు కట్టలేదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం మాత్రమే ఇచ్చా" అని తేల్చారు. ఈ వ్యాఖ్యలు వ్లాగ్‌లో చర్చనీయాంశమయ్యాయి.
గడ్కరీ దంపతులు వ్లాగ్‌లో తమ వైవాహిక జీవితంలోని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. పని పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండటమే తన సిద్ధాంతమని మంత్రి స్పష్టం చేశారు.

