2027లో వేగవంతమైన డేటా విడుదల

భారత ప్రధాన రిజిస్ట్రార్‌, జనగణన కమిషనర్‌ కార్యాలయం సోమవారం కీలక ప్రకటన చేసింది. 2027లో నిర్వహించే జనగణనను దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబోతున్నట్టు జనగణన కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది. డిజిటల్‌ గణన నిర్వహించడం వల్ల గత జనగణనలతో పోలిస్తే ఈసారి డేటా వేగంగా అందుబాటులోకి రానుందని కమిషన్‌ స్పష్టం చేసింది. ఆర్‌జీఐ కార్యాలయం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేసింది. జనగణనను రెండు దశలుగా నిర్వహించనున్నట్టు ఆర్‌జీఐ తెలిపింది. ఈ ప్రక్రియలో మొట్టమొదటిసారి సాంకేతికతను వినియోగిస్తూ, డేటాను డిజిటల్ రూపంలో సేకరించి కేంద్ర సర్వర్‌కు ఎలక్ట్రానిక్‌ విధానంలో పంపించనున్నారు. ఈ ఆధునిక డిజిటల్ జనగణన దేశపు పరిపాలన, అభివృద్ధికి మైలురాయి కానుందని జనగణన కమిషనర్‌ కార్యాలయం అభిప్రాయ పడింది. ప్రజల సహకారం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్టు ఆర్‌జీఐ కార్యాలయం పేర్కొంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story