Karur Stampede Tragedy: తమిళనాడు కరూర్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు కరూర్‌ను సందర్శించి, అర్హులైన 32 మంది బాధిత కుటుంబ సభ్యులకు తాత్కాలిక నియామక పత్రాలను అందజేశారు.

హైకోర్టు ఉత్తర్వుల్లో ఉద్యోగాలు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలని, ఇవి న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం పరిమితంగా ఉండాలని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది.

గత ఏడాది టీవీకే (TVK) ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం విజయ్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారణ జరిపిన కోర్టు ఉద్యోగాలు అందజేసేందుకు అనుమతి ఇచ్చింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారిగా కరూర్‌కు వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి, వారి ఆవేదనను విని సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలికంగా నియమించిన 32 మందికి అధికారిక పత్రాలు అందించారు.

ఈ చర్యతో బాధిత కుటుంబాలకు కొంత ఆదుకు లభించనుందని, ప్రభుత్వం హామీలను నెరవేరుస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story