Majority Secured: తమిళనాడులో గత మూడు రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే (తమిళగ వేత్రిక్ కళగం) అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. చిన్న పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేసుకున్న విజయ్, శుక్రవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), వీసీకే (విసికె) పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఈ మద్దతుతో టీవీకే బలం 118 సీట్లకు చేరుతోంది. టీవీకే ఒంటరిగా 108 సీట్లు గెల్చుకున్నా, విజయ్ రెండు చోట్ల నుంచి గెలవడంతో సీట్ల సంఖ్య 107కి తగ్గింది.

మద్దతిచ్చిన పార్టీలకు మంత్రి పదవులు కేటాయించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు రెండు, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు ఇవ్వనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం మిత్రపక్షాలతో విజయ్ భేటీ జరగనుంది.

పార్టీల వారీ సీట్ల వివరాలు:

టీవీకే: 107

కాంగ్రెస్: 5

సీపీఐ: 2

సీపీఎం: 2

వీసీకే: 2

ఈ పరిణామాలతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైనట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story