ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్‌!

Minister Narahari Jirwal:మహారాష్ట్ర ఆహార, ఔషధాల నియంత్రణ శాఖ మంత్రి నరహరి జిర్వాల్ తన అధికారిక నివాసంలోనే ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మంత్రి నరహరి జిర్వాల్‌ను మంత్రివర్గం నుంచి తక్షణం తొలగించాలని డిమాండ్ చేసింది.

నాసిక్ జిల్లాలోని డిండోరీ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ అభ్యర్థిగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన నరహరి జిర్వాల్ గిరిజన నేతగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే, అతని అధికారిక నివాసంలో జరిగిన ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాజీవితంలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయని, ఈ ఘటన దానికి స్పష్టమైన ఉదాహరణ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెట్టీవార్ మాట్లాడుతూ, “అధికార కూటమిలోని మిత్రపక్షాల మధ్య జరుగుతున్న కలహాల వల్లే ఈ వీడియో బయటపడింది. ప్రభుత్వంలోని ముఠా తగాదాలకు ఇది నిదర్శనం” అని అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి తక్షణం స్పందించి మంత్రి నరహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలి” అని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలపై మంత్రి నరహరి జిర్వాల్ స్పందిస్తూ, “అది మార్ఫింగ్ చేసిన వీడియో. నన్ను బ్లాక్‌మెయిల్ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు” అని తెలిపారు. అయినప్పటికీ, వీడియో వైరల్‌తో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story