మోహన్‌ భాగవత్‌ సందేశం

Mohan Bhagwat: స్వార్థ ప్రయోజనాలు, ఆధిపత్య ఆకాంక్షలే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలకు, యుద్ధాలకు ప్రధాన కారణమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, ధర్మాచరణ ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో శుక్రవారం విదర్భ ప్రాంత విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యాలయానికి భూమిపూజ చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. గత 2 వేల ఏళ్లుగా ప్రపంచం వివిధ మార్గాలను ప్రయత్నించినా ఘర్షణలకు స్థిరమైన పరిష్కారం దొరకలేదని భాగవత్‌ అన్నారు. శాంతియుత జీవనానికి సామరస్యం, సహకారమే ఏకైక మార్గమని ఆయన సూచించారు.

ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణలు అంతా మానవ స్వార్థం, ఆధిపత్య ఆకాంక్షల వల్లనేనని ఆయన విమర్శించారు. ధర్మం, సత్యం, అహింసా మార్గంలో నడిచే సమాజమే నిజమైన శాంతిని సాధించగలదని భాగవత్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story