Narendra Modi: ప్రధాని మోదీ: తొమ్మిది ప్రతిజ్ఞలు చేసి వికసిత్ భారత్‌కు దోహదం చేయండి
తొమ్మిది ప్రతిజ్ఞలు చేసి వికసిత్ భారత్‌కు దోహదం చేయండి

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వికసిత్ కర్ణాటకతో పాటు దేశం మొత్తం అభివృద్ధి వేగవంతం కావాలంటే ఈ ప్రతిజ్ఞలను నిజాయితీగా, శ్రద్ధగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“మీ నుంచి నాకు తొమ్మిది హామీలు కావాలి. వికసిత్ కర్ణాటక కోసం మీరంతా ఈ ప్రతిజ్ఞలపై మాటివ్వండి. ఇవి పాటిస్తే కర్ణాటక అభివృద్ధితో భారతదేశం కూడా వేగంగా ముందుకు సాగుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ ప్రకటించిన తొమ్మిది ప్రతిజ్ఞలు ఇవి:
నీళ్లను వృథా చేయకుండా పొదుపుగా వాడుదాం.
పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిద్దాం.
అమ్మ పేరుతో మొక్కలు నాటుదాం.
‘వోకల్ ఫర్ లోకల్’ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి చాటి చెబుదాం.
జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేద్దాం.
రసాయనాలు లేకుండా సహజ వ్యవసాయం చేద్దాం.
ఆహారంలో తృణధాన్యాలు (మిల్లెట్స్)ను భాగం చేసుకుందాం.
నూనె పదార్థాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకుందాం.
ఫిట్‌గా ఉండి, బరువును అదుపులో ఉంచుకుంటూ ప్రకృతికి సేవ చేద్దాం.
ఈ ప్రతిజ్ఞలు పాటించడం ద్వారా పర్యావరణ సంరక్షణ, స్వదేశీ ప్రోత్సాహం, ఆరోగ్యం మరియు దేశ అభివృద్ధికి గణనీయమైన సహకారం అందుతుందని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.

