West Bengal: మే 9న బెంగాల్లో కొత్త భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం
కొత్త భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం

West Bengal: పశ్చిమబెంగాల్‌లో మే 9న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించారు. నోబెల్ పురస్కార గ్రహీత మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ తేదీని ఎంపిక చేశారు. ఠాగూర్ ఆశీర్వాదాలతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు సంబంధిత అన్ని పనులు వేగంగా చేపట్టామని సమీక్ భట్టాచార్య పేక్షించారు.
అయితే, కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సువేందు అధికారి వంటి ప్రముఖ నేతల పేర్లు ప్రతిపాదితులుగా చర్చల్లో ఉన్నాయి.
ఎన్నికల సంఘం (ఈసీ) ఉన్నతాధికారులు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను నేడు ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు. బుధవారం ఈ అధికారిక పత్రాలను గవర్నర్ ఆర్.ఎన్. రవికి సమర్పించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజీనామా సమర్పించాల్సిందిగా ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు మమతా బెనర్జీ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
ఈ ఎన్నికల్లో భాజపా భారీ మెజారిటీ సాధించి, పశ్చిమబెంగాల్‌లో తొలిసారి అధికారం చేపట్టనుంది. రాష్ట్రంలో కొత్త పాలనా వ్యవస్థ, అభివృద్ధి, భద్రతా హామీలతో ఒక కొత్త యుగం మొదలవుతుందని భాజపా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం
బెంగాల్‌లోని అసన్‌సోల్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా మూసివేయబడిన దుర్గా దేవి ఆలయం సోమవారం తిరిగి తెరుచుకుంది. భాజపా ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన వాగ్దానం నెరవేర్చి ఆలయాన్ని పునఃప్రారంభించారు.

