నిమిషప్రియ మరణ శిక్ష రద్దు కాలేదు
తమకెలాంటి సమాచారం లేదంటున్న కేంద్ర ప్రభుత్వం

కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష రద్దు అయ్యిందని వస్తున్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. నిమిషప్రియ మరణశిక్ష రద్దుకు సంబంధించి తమకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు యెమన్ దేశం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణశిక్షను రద్దు చేయించడానికి కేరళకు చెందిన సున్నీ మదప్రబోధకుడు కాంతపురం ఏపీ అబుబకర్ రంగంలోకి దిగి గత కొన్ని వారాలుగా యెమన్ దేశంతో రాయబారాలు నడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి అబూబకర్ కార్యాలయం నుంచి నిమిషప్రియ మరణశిక్షను యెమన్ ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే నిమిషప్రియ మరణశిక్ష రద్దు అయినట్లు తమకు ఎటువంటి సమాచార లేదని, వ్యక్తిగత ప్రకటనలతో విదేశాంగ శాఖకు ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ ఆ వార్తలను తోసిపుచ్చింది.
