Supriya Sule: డీలిమిటేషన్ బిల్లుపై అధికారిక నిర్ణయం లేదు: సుప్రియా సూలే
సుప్రియా సూలే

Supriya Sule: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తమ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పష్టం చేశారు.
ఈ అంశంపై సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న ప్రచారాన్ని “టీ కప్పులో తుపాను” అని వ్యాఖ్యానించిన ఆమె, ఎన్‌డీయే కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు వ్యాప్తి చేస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. ఒక జర్నలిస్టు స్నేహితుడితో తన వాట్సాప్‌లో జరిగిన వ్యక్తిగత సంభాషణను పార్టీ అధికారిక వైఖరిగా చూపడం సరికాదని ఆమె అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని, వాటికి ఎలాంటి అన్యాయం జరగకూడదని తమ పార్టీ భావిస్తోందని సుప్రియా సూలే తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచే విషయంలో అధికారికంగా వివరాలు వెల్లడి చేస్తేనే బిల్లును పరిశీలించి, మద్దతు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. బిల్లు వివరాలు చూడకుండానే స్పందించడం సరికాదన్నారు.
ఈ వ్యాఖ్యలతో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఊహాగానాలకు సుప్రియా సూలే బ్రేక్ వేశారు.

