స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని నరేంద్రమోడీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రసంగం చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌కు భారతదేశం భయపడే రోజులు ఎప్పుడో పోయాయాని, అణుబాంబుల బెదిరింపులు ఇకపై సహించేది లేదని ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోడీ శత్రుదేశాలను హెచ్చరించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం 140 కోట్ల భారతీయ ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆపరేషన్‌ సింధూర్‌ విజయం గురించి ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఆపరేషన్‌ సింధూర్‌తో భారత్‌ సత్తా ప్రపంచ వ్యాప్తంగా చాటామని పేర్కొన్నారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి చేసి భార్యల మందే భర్తలను కాల్చి చంపేశారని, మతం అడిగి మరీ హతమార్చారని దీనికి ఘాటైన సమాధానంగా ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని ప్రధాని వెల్లడించారు. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్ర స్ధావరాలను మన సైన్యం నేలమట్టం చేసిందని ప్రధాని మోడీ చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌ హీరోలకు ఎర్రకోటపై నుంచి ప్రధాని సెల్యూట్‌ చేశారు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఉగ్రమూకలకు తగిన బుద్ది చెప్పామని చెప్పారు. ఎన్నో ఏళ్ళుగా అణుబాంబుల పేరు చెప్పి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఇకపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే అందుకు ధీటుగా సమాధానం ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా హెచ్చరించారు. ఇదే ఆపరేషన్‌ సింధూర్‌తో మేడిన్‌ ఇండియా సత్తాను ప్రపంచానికి చాటామన్నారు. ఆత్మనిర్భర్‌ అంటే డాలర్‌, పౌండ్లపై ఆధారపడటం కాదని స్వయం సమృద్ధి దిశగా నడుస్తున్నామని మోడీ తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌తో మన సామర్ధ్యం ప్రంపచ దేశాలకు తెలిసిందన్నారు. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వతంత్ర్యం వచ్చిందని ఒకే దేశం ఒకే రాజ్యాంగం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారని మోడీ గుర్తు చేశారు. ఎర్రకోట నుంచి వరుసగా 12వ సారి మువ్వన్నెల పతాకవిష్కరణ చేసి అత్యధిక సార్లు ఎర్రకోటపై జెండా వందనం చేసిన రెండో ప్రధానిగా నరేంద్రమోడీ రికార్డ్ సృష్టించారు.

Updated On 15 Aug 2025 1:07 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story