Minister Jaishankar : మా కొనుగోళ్ళు దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయి
విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ కీలక వ్యాఖ్యలు

దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ లీడర్స్ పోరం సదస్సలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అమెరికా భారతదేశంపై విధిస్తున్న సుంకాలపై స్పందించారు. రష్యా దేశం నుంచి భారత దేశం చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధిస్తున్న అధిక సుంకాలపై విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంతో ఏదైనా సమస్య ఉంటే మా దేశం ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య పరమైన చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జయశంకర్ తెలిపారు. ఏదిఏమైనా మన దేశానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుందని జయశంకర్ అన్నారు. భారతదేశ రైతులు, మధ్య, చిన్నతరహా ప్రొడక్షన్‌దారుల ప్రయోజనాలను కాపడటమే కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడే పరిస్ధితి ఉండబోదన్నారు. ఒకవేళ భారత దేశంతో అమెరికాకు సమస్య ఉంటే మా దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవీ కొనవద్దని జయశంకర్ సుతిమెత్తగా సలహా ఇచ్చారు. మా ఉత్పత్తులను కొనమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదని అమెరికాను ఉద్దేశించి కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు.
