పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కాశ్మీర్ లో టూరిజాన్ని దెబ్బతీసేందుకు, మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలనే లక్ష్యంతో చేసిన అనాగరిక చర్యగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభివర్ణించారు. డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాల పర్యటనలో ఉన్న కేంద్ర మంత్ర జైశంకర్ ఓ ఇంటర్వ్యూలో పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ పైనా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఆసిమ్ మునీర్ తీవ్రమైన మతతత్వవాదని విమర్శించారు. పహల్గాంలో ఉగ్రవాదులు మతం అడిగి నిర్ధారించుకున్న తరువాతే కుటుంబ సభ్యుల మందే హత్య చేశారని వివరించారు. మతపరమైన విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే మతం అనే అంశాన్ని ఈ మారణకాండలో ఉగ్రవాదులు ముందుకు తెచ్చారని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరు అయిన పర్యాటక రంగాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.

Updated On
Politent News Web 1

Politent News Web 1

Next Story