Ex Mp Prajwal Revanna : పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ దోషే
కర్నాటక మాజీ ఎంపీ ప్రజ్వల్‌ని దోషిగా నిర్ధారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు

మాజీ ప్రధాని దేవెగౌడ మనమడు, కర్నాటక రాష్ట్రానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణను ఒక లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈకేసుకు సంబంధించి రేవణ్ణకు శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయస్ధానం వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలోని హసన్ లోక్‌సభ స్ధానం నుంచి గతంలో ఎంపీగా గెలుపొందిన ప్రజ్వల్ రేవణ్ణ లాక్‌డౌన్ సమయంలో గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో తనపై మూడు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పనిమనిషి 2021లో పోలీసులను ఆశ్రయించిన సంగతి విదితమే. ఆ నాడు అత్యాచార ఘటనను ప్రజ్వల్ తన మొబైల్‌లో వీడియాఓ తీశాడని, ఈ విషయం బయటకు ఎక్కడా చెప్పవద్దని బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. ఈ విషయం ప్రజ్వల్ తల్లితండ్రులకు తెలిసి తనను కిడ్నిప్ చేసి బెదిరించినట్లు కూడా పనిమనిషి ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి వేసిన సిట్ ముమ్మర దర్యాప్తు చేసింది. లీకైన వీడియోలను ఫోరెన్స్ నివేదికలకు పంపగా అవి ఒరిజనల్ వీడియోలని ధృవీకరింపబడ్డాయి. గత సంవత్సరం మే 31వ తేదీ జర్మనీ నంచి తిరిగి వచ్చిన ప్రజ్వల్ రేణ్ణను బెంగళూరు ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రజ్వల్ జ్యుడీషియల్ కష్టడీలోనే ఉన్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ 26 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించి 2వేల పేజీల ఛార్జ్‌షీట్ సమర్పించారు. దీని ఆధారంగా ప్రజా ప్రతినిధుల కోర్టు ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా ప్రకటించింది. మాజీ ప్రధాని దేవెగౌడ్ పెద్ద కుమారుడు రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరపున 2019లో హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందాడు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన్ను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అఫిడవిట్‌లో కొన్ని నగదు లెక్కలను సరిగా చూపించలేదన్న కారణంతో 2023లో కర్నాటక హైకోర్టు ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది.
