Jairam Ramesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్. పార్లమెంటు మరియు దాని కమిటీల గౌరవాన్ని దెబ్బతీసేలా అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను కోరారు.

నీట్‌-యూజీ పరీక్ష రద్దు అనంతరం ఈ నెల 15న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ ఒక పార్లమెంటు కమిటీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జైరాం రమేశ్ ఆరోపించారు. ‘పార్లమెంటు కమిటీల్లోని రెడ్‌ ఫ్లాగ్స్‌పై నేను మాట్లాడను’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు పట్ల ధిక్కార భావనను ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు.

పార్లమెంటు, దాని కమిటీల గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం సభా హక్కుల ఉల్లంఘన అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. రాజ్యసభ కార్యకలాపాల నియమావళి ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్‌పై నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ప్రధాన్‌పై విచారణ ప్రారంభించాలని రాజ్యసభ ఛైర్మన్‌ను అభ్యర్థించారు.

ఈ ఘటన పార్లమెంటరీ ప్రక్రియల పట్ల మంత్రుల వైఖరిని ప్రశ్నించేలా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story