దేశ భద్రతలో ముఖ్య భూమిక పోషించే విభాగానికి కేంద్రం నియామకం చేసింది. పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌ ‘రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌’ (RAW) చీఫ్‌గా నియామకం అయ్యారు. ప్రస్తుత చీఫ్‌ రవి సిన్హా పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. తదుపరి రా చీఫ్‌గా పరాగ్‌ జైన్‌ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్‌ కమిటీ ఈ రోజు(శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న పదవీ బాధ్యతలు చేపట్టనున్న పరాగ్‌ జైన్‌ రా చీఫ్‌గా రెండేళ్లపాటు కొనసాగుతారు.

1989 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌. ప్రస్తుతం ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. పాకిస్థాన్‌పై ఇటీవలే చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో పరాగ్‌ జైన్‌ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్‌ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.

Politent News Web3

Politent News Web3

Next Story