కాంగ్రెస్‌లోనే ఉంటా: థరూర్

MP Shashi Tharoor: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజాయితీ గల నాయకుడని, దేశంలో వ్యాప్తి చెందుతున్న మతతత్వం, ద్వేషం, విభజన రాజకీయాలపై ఆయన బలమైన స్వరం వినిపిస్తున్నారని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రశంసలు చేశారు. రాహుల్ గాంధీపై వచ్చే తప్పుడు వ్యాఖ్యలతో తాను ఎప్పుడూ ఏకీభవించలేదని స్పష్టం చేశారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన థరూర్, దేశవ్యాప్తంగా మతతత్వం, ద్వేష ప్రచారాలు, విభజన రాజకీయాలపై రాహుల్ నిరంతరం మాట్లాడుతున్నారని, అందరూ ఆయన్ని ఇష్టపడతారని, తనకు ఆ విషయంలో భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.

పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ఢిల్లీలో సమావేశమై తన ఫిర్యాదులను పరిష్కరించుకున్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కొన్ని అంశాలపై తన వైఖరి బీజేపీకి అనుకూలంగా ఉందని మీడియాలో ప్రచారం జరిగిందని, అయితే తాను ఆ అంశాలను ప్రభుత్వానికి మరియు దేశ హితానికి అనుకూలంగా భావిస్తున్నానని థరూర్ వివరించారు. పార్లమెంటులో ఎప్పుడూ పార్టీతోనే నిలబడ్డానని, ఇందుకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారా అని మీడియా ప్రశ్నించగా, ‘‘నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని యూడీఎఫ్ విజయానికి కృషి చేస్తాను’’ అంటూ థరూర్ స్పష్టంగా తేల్చిచెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story