Harbhajan Singh: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నుంచి రాజ్యసభకు ఎంపికైన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు హర్భజన్. రాజ్యసభ సీటును ఆప్ అమ్మేసిందని ఆయన ఆరోపించారు.

హర్భజన్ సింగ్‌పై నెటిజన్లు విమర్శలు చేయడంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఒక నెటిజన్ "ఆప్ నుంచి వచ్చిన రాజ్యసభ సీటుకు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? మీ మనస్సాక్షికి ఎంత వెలకట్టి బీజేపీలో చేరారు?" అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హర్భజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"సమయం వచ్చినప్పుడు అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నేను ఎప్పుడూ ఎవరి గురించీ తప్పుగా మాట్లాడలేదు. నన్ను ద్రోహి అనే ముందు, మీ పార్టీ నేతలు రాజ్యసభ సీటును ఎంతకు అమ్ముకున్నారో అడగండి. వారు చెప్పకపోతే ఎవరికి ఎంత కానుక వచ్చిందో, ఎవరి వైపు నుంచి వచ్చిందో నేను బయటపెడతాను" అని హర్భజన్ హెచ్చరించారు.

పంజాబ్‌ను దోచుకోవడంలో ఆప్ నేతలు, మంత్రులు, అధికారులు ప్రజలను ఎలా మోసం చేశారో కూడా వెల్లడిస్తానని హర్భజన్ స్పష్టం చేశారు. "పంజాబ్‌పై కేజ్రీవాల్‌కు కనీసం ఒక్క శాతం ప్రేమ ఉంటే బాగుండేది" అని వ్యాఖ్యానించారు.

హర్భజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఆప్‌లో రాజ్యసభ సీట్ల అమ్మకాల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, కుట్రలను బయటపెట్టాయని అన్నారు. భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story