సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

తనను అభిశంసించాలని ఇచ్చిన విచారణ కమిటీ ప్రతిపాదనను సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ గతంలో ఢిల్లీ హైకోర్టులో పని చేస్తున్న కాలంలో ఆయన అధికారిక బంగ్లాలో జరిగిన అగ్నిప్రమాదం సందర్భంగా మంటలను ఆర్పుతున్నప్పుడు కోట్ల రూపాయల కాలిన నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ఆ సంర్భంలో ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి తక్షణం అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ, ఈ వ్యవహరంపై ముగ్గురు జడ్జిలతో ఒక విచారణ కమిటీ నియమించారు. ఈ కమిటీ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. అయితే ఈ విచారణ కమిటీ నివేదిక తనకు జడ్జి పదవి వల్ల సంక్రమించిన రాజ్యంగపరమైన హక్కులకు భగం కలిగించేదిలా ఉందని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. తనను అభిసంసించాలని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా చేసిన ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్లో అభ్యర్ధించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆయనపై యశ్వంత్‌ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఈ వ్యవహారంలోనే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్లతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలయ్యింది. ఈ పిటీషన్ను సర్వోన్నత న్యాయస్ధానం విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Politent News Web 1

Politent News Web 1

Next Story