పైలట రహిత ఏరియల్‌ వెహికిల్‌ ప్రయోగం సక్సెస్

పహల్గామ్‌ ఉగ్రదాడి తదనంతర పరిణామాల తరువాత పొరుగు దేశం పాకిస్తాన్‌ తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ తన అమ్ముల పొదిలో సరికొత్త యుద్ద పరికరాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగానే భారత రక్షణ దళం అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ ద్రోణ్ల సామరధ్యంపై దృష్టి పెట్టింది. సోలార్‌ డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ తయారు చేసిన హైబ్రీడ్‌ వర్టికల్‌ టేకాఫ్‌ మరియూ ల్యాండింగ్‌ ఏరియల్‌ వెహికిల్‌ ని ప్రయోగాత్మకంగా ఉపయోగించింది. రాజస్తాన్‌ లోని ప్రోక్రాన్లో ఈ ఏరియల్‌ వెహికిల్‌ పై చేపట్టిన ట్రయల్ రన్‌ విజయవంతం అయ్యింది. ఈ ఏరియల్‌ వెహికిల్స్‌ టాకాఫ్‌ అవ్వడానికి ల్యాండ్‌ అవ్వడానికి ఎటువంటి రన్‌ వేలు అవసరం లేదు. రన్‌ వే లేకుండానే టేకాఫ్‌, ల్యాండింగ్‌ అవ్వడం వీటి ప్రత్యేకత. సర్వైలెన్స్‌, మ్యాపింగ్‌, డెలివరీ వంటి వ్యవహరాలకు ఇండియన్‌ ఆర్మీలో ఈ పైలట్‌ రహిత ఏరియల్‌ వెహికిల్స్‌ కీలకం కానున్నాయి.

Updated On 13 Jun 2025 5:13 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story