Supreme Court: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కరూర్‌ పర్యటనను అడ్డుకోవాలని డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఖారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం డీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ లతో కూడిన ధర్మాసనం “సీఎం పర్యటనలను మేము నియంత్రించాలా? దేశంలోని ప్రజలందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది. దానిపై ఆంక్షలు విధించాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విచారణకు ఆదేశించిన తాము ఒక రాజకీయ ప్రత్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ఎలా అంగీకరించాలని ప్రశ్నించింది. సర్వోన్నత న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని హెచ్చరించింది.

డీఎంకే తరఫు న్యాయవాది విజయ్‌ను నిందితుడిగా చూపించడానికి ప్రయత్నించగా, సుప్రీం కోర్టు రెండు ఎఫ్‌ఐఆర్‌లలోనూ విజయ్‌ పేరు లేదని స్పష్టం చేసి పిటిషన్‌ను కొట్టేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జూలై 10న కరూర్‌కు వెళ్లి, తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను కలిసి వారికి కారుణ్య నియామకాలు, ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పర్యటనను అడ్డుకోవాలని డీఎంకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో విజయ్ పర్యటనకు మార్గం సుగమమైంది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story