వడోదరా, ఆనంద్‌ పట్టణం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

వాహనాలు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయిన ఘోర సంఘటన బుధవారం గుజరాత్‌ రాష్ట్రంలో జరిగింది. గుజరాష్ట్రంలోని పద్రా ప్రాంతంలో ఉన్న మహిసాగర్‌ నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో పది మంది చనిపోగా పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. గుజరాత్‌ లోని వడోదరా, ఆనంద్‌ పట్టణాన్ని కలుపుతూ మహిసాగర్‌ నదిపై ఉన్న పద్రా వద్ద ఉన్న గంభీర వంతెన బుధవారం ఉదయం కొంత భాగం కూలిపోయింది. దీంతో వంతెన పైన వెళుతున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లతో సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈఘటనలో పది మంది వరకూ మృతి చెందినట్లు అధికారులు చెపుతున్నారు. వంతెన కూలిన సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే వంతెన చాలా పాతది అవడంతో కొన్నొ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయి ఉండచ్చని అధికారులు చెపుతున్నారు. ఈ వంతెనకూలండంతో వడోదరా, ఆనంద్‌ పట్టణల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Politent News Web 1

Politent News Web 1

Next Story