మృతురాలు రాష్ట్ర స్ధాయి టెన్నిస్‌ క్రీడాకారిణి

స్పోర్ట్స్‌ అకాడమీ నిర్వహిస్తున్న రాష్ట్ర స్ధాయి టెన్నిస్‌ క్రీడాకారిణని ఆమె తండ్రే షూట్‌ చేసి చంపేశాడు. మానవత్వాన్ని మంట గలిపే ఈ దారుణమైన సంఘటన గురగ్రామ్‌ లో గురువారం చోటు చేసుకుంది. స్వతహగా రాష్ట్ర స్ధాయి టెన్నిస్‌ క్రీడాకారిణి అయిన రాధికా యాదవ్‌ గురుగ్రామ్‌ లో స్పోర్ట్స్‌ అకాడమీ నడుపుతోంది. గతంలో రాధికకు ప్రమాదం జరగడంతో టెన్నిస్‌ రెగ్యులర్‌ గా ఆడే పరిస్ధితి లేకపోవడంతో గురగ్రామ్‌ లో స్పోర్ట్స్‌ అకాడమీ స్ధాపించింది. ఈ అకాడమీని రాధికతో పాటు ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ కూడా చూసుకుంటూ ఉండేవాడు. అయితే తన స్పోర్ట్స్‌ అకాడమీ గురించి రాధిక ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తుండటంతో అవి చేయవద్దని తండ్రి దీపక్‌ ఆమెను మందలించాడు. అయినా వినకుండా రాధిక రీల్స్‌ చేస్తుండటంతో తన పరువుకు భంగం కలిగిస్తోందని భావిచిన దీపక్‌ కన్న కూతిరిని హతమార్చినట్లు పోలీసులు చెపుతున్నారు. దీనికి తోడు దీపక్‌ సన్నిహుతులు, ఇరుగుపొరుగు కూతురు సంపాదన మీద బతుకుతున్నావని అతన్ని హేళన చేస్తుండటం భరించ లేక కూడా ఈ హత్యకు పాల్పడ్డట్లు సమాచారం. గురుగ్రామ్‌ లోని సెక్టార్‌ 57లోని వారి నివాసంలో గురువారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో రాధికను తండ్రి దీపక్‌ వెనకనుంచి కాల్చి చంపాడు. రివాల్వర్‌ మూడు రౌండ్లు కాల్చడంతో ఆ శబ్ధానికి కిందనే నివసిస్తున్న రాధిక మేనమామ కులదీప్‌ యాదవ్ పైకి వెళ్లి చూడగా వంట గదిలో రాధిక రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వెంటనే కుమారిడి సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాధిక మేనమామ కులదీప్‌ యాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ద్యాప్తు చేస్తున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story