“బస్తర్ అడవుల్లో అదృశ్య శక్తి… మద్వి హిడ్మా కథ”
రెండు దశాబ్దాల భయం… హిడ్మా

“బస్తర్ అడవుల్లో అదృశ్య శక్తి… మద్వి హిడ్మా కథ”
దక్షిణ బస్తర్ అడవుల్లో…
భారత భద్రతా వ్యవస్థను రెండు దశాబ్దాలుగా సవాలు చేస్తున్న పేరు — మద్వి హిడ్మా .
55 ఏళ్ల హిడ్మా… మావోయిస్టుల అత్యంత ప్రమాదకరమైన బెటాలియన్–1 కమాండర్.
అతడి పేరు వినగానే సీఆర్పీఎఫ్ దగ్గర నుంచి, స్థానిక పోలీస్ వరకూ… ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంటుంది.
2004 నుంచి ఇప్పటివరకు…
27 పెద్ద దాడులు.
దాదాపు 200 మంది భద్రతా సిబ్బంది హతమైన ఘటనల వెనుక…
హిడ్మా హస్తం ఉంది.
2010 దంతేవాడా దాడి లో
76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బలితీసుకున్న నరమేధాన్ని నడిపించింది హిడ్మానే.
2013 లో జీరమ్ ఘాటి నరమేధం.రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దాదాపు అంతమైపోయిన ఆ దాడికి కూడా హిడ్మా వ్యూహకర్త.
2017 బుర్కాపాల్ దాడి… 24 మంది జవాన్లు మృతి. ఇవి అన్నీ హిడ్మా మైండ్ గేమ్స్. హిడ్మా… సుక్మా జిల్లా పర్వాతి గ్రామానికి చెందిన స్థానిక గిరిజనుడు. 2001లోనే నక్సల్స్‌లో చేరి, అత్యంత వేగంగా ఎదిగిన కమాండర్. క్రమశిక్షణ, తెలివితేటలు, క్రూరత్వం — ఇవే అతడి ఎదుగుదలకు ప్రధాన కారణాలు.
అతడి కింద 150 మంది బాగా శిక్షణ పొందిన కమాండర్లు పని చేశారు
దాడి సమయంలో — హిడ్మా ఎప్పుడూ ముందే.
ఏప్రిల్ 2… అతడి ఆచూకీతో, 2,000 మంది భద్రతా సిబ్బంది — CRPF, CoBRA, STF, DRG — కలిసి భారీ ఆపరేషన్ ప్రారంభించారు.
కానీ టెకులగూడెం వద్ద… మళ్లీ హిడ్మానే ముందుండి చేసిన దాడి వల్ల భారీ నష్టం జరిగింది.
అతడిని పట్టుకోవడం ఎందుకు అంత కష్టం?
5 కిలోమీటర్ల మల్టీ–లేయర్ భద్రతా వలయం. గ్రామాల్లో బలమైన సమాచార నెట్‌వర్క్. అడవి మార్గాల్లో అసాధారణ పట్టు.
జంగిల్ వార్‌ఫేర్‌లో దూకుడు. అత్యంత కచ్చితమైన ప్లానింగ్ . హిడ్మా గురించి భద్రతా బలగాల వద్ద తాజా ఫోటోలు లేవు.
యువకుడిగా ఉన్న రెండు ఫోటోలు మాత్రమే. అందుకే… అతడి నిజమైన రూపం ఈరోజు కూ ఎలా ఉందో ఎవరికి తెలియదు.
2000 నుంచి 2019 వరకూ బస్తర్‌ను రక్తపాతంతో నింపిన మావోయిస్టు నాయకుడు రమన్నాకి హిడ్మా అత్యంత సన్నిహితుడు.
రమన్నా మరణం తర్వాత హిడ్మా CPI (మావోయిస్టు) మిలీషియా కు పూర్తి ఇన్‌చార్జ్ అయ్యాడు. ఇప్పుడు అతడే దండకారణ్య జోనల్ కమిటీ అధినేత. అతడి మీద బహుమతి — రూ. 25 లక్షలు. కానీ… నిన్న మొన్నటివరకు హిడ్మాని పట్టుకోలేక పోయారు .
అడవుల్లో కదులుతున్న ఒక కనిపించని శక్తి. మద్వి హిడ్మా. భారత భద్రతా వ్యవస్థకు ఒక సవాలు.
బస్తర్ అడవుల్లో యుద్ధానికి ఒక ప్రతీక.

