• దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన హత్య
  • హనీమూన్ కని వెళ్లి మిస్ అయిన జంట
  • కొన్నాళ్లకు భర్త అనుమానాస్పద మృతి
  • కనిపించకుండా పోయిన భార్య.. ఆ తర్వాత వెలుగులోకి
  • ప్రేమించిన పనివాడి కోసం భర్తను చంపిన భార్య
  • హనీమూన్ పేరుతో తీసుకెళ్లి ప్రాణం తీసిన సోనమ్
  • ఏమీ తెలియనట్లు కట్టు కథలు చెప్పిన నిందితురాలు
  • ఎప్పుడూలేని సోషల్ మీడియా ఫోటోతో గుట్టు రట్టు
  • పెళ్లికి ముందే పనివాడితో సోనమ్ ప్రేమ
  • తండి ఒప్పుకోడని ఒక పెళ్లి.. ఆతర్వాత మర్డర్ స్కెచ్
  • బోయ్ ఫ్రెండ్ ను చేరడం కోసం భర్త హత్య
  • 20 మంది కోర్ టీమ్, 120మంది గాలింపు సిబ్బంది
  • అహరహం శ్రమించి గుట్టు విప్పిన మేఘాలయ పోలీస్ లు

హానీమూన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.కాళ్ల పారాణి ఆరకముందే, తడి గుడ్డతో భర్త గొంతుకోసిన భార్య ప్రవర్తన చూసిలోకం నివ్వెరపోతోంది. హతుడు రాజా రఘువంశి ఇద్దరు ప్రేమికుల వికృత చర్యలకు అన్యాయంగా ప్రాణాలొదిలాడు.ఇండోర్ జంట మిస్టరీ కేసులో ఎట్టకేలకు మొత్తం గుట్టు వీడింది. హంతకురాలు సాక్షాత్తు స్వయాన భార్యే కావడం ఇక్కడ మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉంది.. ప్రేమించిన వాడికోసం అది.. ఓ పనివాడికోసం నిందితురాలు సోనం ఇంతకు తెగించడం వింటున్న వాళ్ల మతి పోగొడుతోంది. తమ ప్రేమకు భర్త అడ్డొచ్చాడన్న అక్కసుతో చంపేయాలని నిర్ణయించుకున్న సోనమ్ ప్రియుడుతో కలసి ట్రాప్ చేసి మరీ హానీమూన్ స్పాట్ లోనే భర్తను చంపేసింది. హత్య కు ప్లానింగ్ అంతా సోనమ్ చేయగా, పనివాడు కమ్ లవర్ రాజ్ కుశవహ అతడి సుపారీ గ్యాంగ్ కార్యాచరణ అమలు చేశారు.

ప్లాన్ మార్చిన భార్య

గత నెల 20న హానీమూన్ కని బయల్దేరిన సోనమ్ తెలివిగా భర్తను పదిలక్షలు విలువ చేసే నగలు ధరించమనికోరింది. అమాయకపు భర్త వాటిని ధరించి మరీ హనీమూన్ కి బయల్దేరాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మేఘాలయ వెళ్లాల్సి ఉండగా, ప్లాన్ మార్చి హటాత్తుగా ఒరిస్సా గౌహతిలోని కామాఖ్య ఆలయానికి వెళదామని సోనమ్ టిక్కెట్లు కూడా రిజర్వు చేసింది. అక్కడనుంచి రిటర్న్ టిక్కెట్లు మాత్రం చేయలేదు. గౌహతినుంచి షిల్లాంగ్ కు కొత్త జంట వెళిపోయారు.వీరి వెంటే సుపారీ గ్యాంగ్ కూడా ప్రయాణించింది. ఆతర్వాత మే 22న సుపారీ గ్యాంగ్ కూడా గౌహతి నుంచి షిల్లాంగ్ చేరుకుంది. ఆ మరుసటి రోజే అంటే 23నే రాజా రఘువంశిని కత్తితో పొడిచి చంపేశారు.హత్య జరుగుతున్నప్పుడు ఆ ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో సోనం ఉంది.. రాజా రఘువంశిని చంపేయమని సోనమ్ ఆ ముగ్గురినీ ఆదేశించింది. ఆమె ఆదేశాలతో వెనుకనుంచి కత్తులతో పొడిచి దాడి చేసిచంపేశారు. ఘటనా స్థలానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆ తర్వాత అందరూ సమావేశమయ్యారు.

ఇండోర్ కొచ్చి లాడ్జిలో బస..

ఆ తర్వాత సోనమ్ ఒక్కర్తి గౌహతి చేరుకుంది. అక్కడనుంచి సొంతఊరికి బయల్దేరింది. మే 25న ఇండోర్ చేరుకున్న సోనమ్ కోసం అక్కడే ఒక లాడ్జిలో రూమ్ బుక్ చేశాడు రాజ్ కుశవహ. ఎవరికీ అనుమానం రాకుండా తాను మరో హోటల్ రూమ్ లో దిగాడు. ఆ తర్వాత కారు మాట్లాడి యూపిలోని ఘాజీ పూర్ కు సోనమ్ ను కారులో పంపాడు కుశవహ. జూన్ 8న సోనమ్ ఒక ధాబా దగ్గర ఇంటికి ఫోన్ చేసి,తనపై దాడి జరిగిందని ఏడ్చి.. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది.

ఆపరేషన్ హనీమూన్

అత్యంత క్లిష్టంగా మారిన హనీమూన్ మర్డర్ కేసును ఛేదించేందుకు మేఘాలయ పోలీసులు 20 మంది సీనియర్ అధికారులతో కలసి కోర్ టీమ్ ఏర్పాటు చేశారు. 120 మంది కింది స్థాయి పోలీసు సిబ్బందిని కేసు దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దింపారు.అనుమానస్పద ప్రాంతాలన్నింటిలోనూ ఈ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీసీ ఫుటేజ్ లో సోనమ్ తో ఉన్న మరో ముగ్గురు కాంట్రాక్టు కిల్లర్ల ప్రొఫైల్స్ ను చెక్ చేశారు.ఇండోర్ లోని వారి ఇంటి సమీపంలో ఫుటేజ్ లో కనీసం 42 సార్లు వీరు కనిపించారు. గౌహతిలోనే కొత్త జంట తమ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న షాపులో ఒక కత్తి కొనుగోలు చేశారు. అయితే అది తనను చంపేందుకు వినియోగిస్తారని పాపం రాజా రఘువంశికి తెలియదు.

చిక్కుముడి వీడిందిలా..

పెళ్లయ్యాక ఈ జంట కలిసున్న ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా కొత్త జంటది సోషల్ మీడియాలో అప్ లోడ్ కాలేదు. పోలీసులకు ఇక్కడే అనుమానం వచ్చింది. మే23 రాత్రి 2.15కి రాజా రఘువంశి సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఇద్దరు కలసిఉన్న ఫోటో అప్ లోడ్ చేసి తమది ఏడు జన్మల బంధమంటూ కింద సోనమ్ రాసుకొచ్చింది. చూసేవారికి అది రాజా రఘువంశియే పోస్టు చేసినట్లు ఉండేలా అలా చేసింది.అప్పటి వరకూ సోనమ్ పై కొద్దిగా అనుమానం మాత్రమే పోలీసులకు ఉండేది. ఈ చర్య తర్వాత ఆమె హత్యలో కీలక సూత్రధారి అన్న విషయం అర్దమైపోయింది.హత్య జరిగిన చోట కిల్లర్ ఆకాష్ చొక్కా రక్తం మడుగులో దొరికింది.సోనమ్ తన రైన్ కోటును ఆకాష్ కి ఇచ్చింది. ఆ కోట్ కూడా హత్య జరిగిన ప్రదేశానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దొరికిందని పోలీసులు తెలిపారు.

మొత్తం మీద హంతకురాలు సోనమ్ వికృత చర్యలు ఈ విధంగా బయటపడ్డాయి. పైగా ఆమె తరచు రాజా కుశవహకి ఫోన్ చేసి తన భర్తకు తాను దూరంగా ఉన్నట్లు ఇప్పటి దాకా తనను ఆయన తాకలేదని చెప్పుకుంటూ వచ్చింది. ఈపెళ్లి తనకు అసహ్యం కలిగిస్తోందని కూడా ఒక లేఖలో రాసినట్లు సమాచారం.పెళ్లి ఇష్టం లేకపోతే పారిపోయిఉండాల్సిందని, ప్రాణాలెందుకు తీసావంటూ హతుడి కుటుంబం గుండెలవిసేలా విలపిస్తోంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story