విమాన ప్రమాదంపై 15 పేజీల నివేదిక సమర్పించిన ఏఏఐబి

గత నెల 12వ తేదీన ఆహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 విమానం ప్రమాదంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో విడుదల చేసింది. జూన్‌ 12వ తేదీన ఆహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే ఫ్యూయెల్‌ కంట్రోల్‌ స్విచ్‌ లు కొన్ని సెకన్ల పాటు ఆగిపోయినట్లు తమ విచారణలో తేలినట్లు ఏఏఐబీ పేర్కొంది. విమానం కూలిపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఏఏఐబీ అభిప్రాయపడింది. ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ 15 పేజీల నివేదిక సమర్పించింది. ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌ లు ఆగిపోవడం గమనించిన ఒక పైలట్‌ మరో పైలట్‌ని స్విచ్‌ లు ఎందుకు ఆపావని ప్రశ్నించినట్లు… ఆతను ఆపలేదని మరో పైలెట్‌ సమాధానం ఇచ్చినట్లు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో ఇద్దరి పైలట్ల సంభాషణ రికార్డ్‌ అయినట్లు ఏఏబీఐ నివేదికలో పొందుపరిచింది. ఈసంభాషణ తరువాత ఒక పైలెట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కి మేడా కాల్‌ ఇచ్చినట్లు ఏఏఐబీ చెప్పింది. పైలట్‌ మేడే కాల్‌ కి ఏటీసీ స్పందిచినప్పటికీ తిరిగి ఎయిర్‌ ఇండియా విమాన పైలట్ల నుంచి ఎటుంటి స్పందన రాలేదని ఏఏఐబీ నివేదికలో స్పష్టం చేసింది. ఏటీసీ పైలట్లను కాంటాక్ట్‌ చేసేలోపే ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయినట్లు నివేదికలో స్పష్టం చేసింది. రెండు ఇంజన్లకు క్షణాల్లో ఇంధన సరఫరా నిలిచిపోవడంతో టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే విమానానికి ఉన్న రెండు ఇంజన్లు ఆగిపోయినట్లు ఏఏఐడీ గుర్తించింది. ప్రమాదం జరిగిన తరువాత తీసిన ఫొటోలు, వీడియోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించామని, విమానానికి సంబంధించిన రెండు ఇంజన్లను కూడా వెలికి తీసి భద్రపరిచినట్లు ఏఏఐబీ నివేదికలో స్పష్టం చేసింది. ప్రమాదానికి ముందు విమానంలో అన్ని పారామీటర్లు సరిగానే ఉన్నాయని, విమానంలో ఎటువంటి పేలుడు పదార్ధాలు కూడా లేవని ఏఏఐబీ తన నివేదికలో పేర్కొంది. అలాగే గగనతలంలో విమనాన్ని ఎటువంటి పక్షి కూడా ఢీ కొనలేదని ఏఏఐబీ తేల్చి చెప్పింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story